పార్టీ మార్పు ప్రచారం కలకలం: వైసీపీని వీడుతున్నారా కోలగట్ల వీరభద్రస్వామి

రిపోర్టర్: B RAJESH స్థలం: బొబ్బిలి

మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆయన అనుచరులు టీడీపీలో చేరడంతో స్వామి కూడా వైసీపీకి గుడ్బై చెబుతారనే ప్రచారం స్థానికంగా జోరందుకుంది. పాత రాజకీయ వైరం నేపథ్యంలో టీడీపీలో అవకాశం దక్కుతుందా లేదా జనసేన, బీజేపీలలో చేరుతారా అన్న చర్చ సాగుతోంది. మరోవైపు స్వామి పార్టీ మారుతున్నారన్న వార్తలను వైసీపీ శ్రేణులు పూర్తిగా ఖండించాయి.