తిరుమలలో భక్తుల రద్దీ: సర్వదర్శనానికి 20 గంటల సమయం

రిపోర్టర్: గోపి స్థలం: తిరుపతి

తిరుమలలో వారాంతపు రద్దీ పెరగడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్టుమెంట్లు నిండాయి. సర్వదర్శనం కోసం భక్తులు 20 గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. నిన్న ఒక్కరోజే 68,374 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.4.03 కోట్ల ఆదాయం లభించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. 35,241 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.