రాష్ట్రంలో స్టేట్ ఆర్గనైజ్డ్ టెర్రరిజం నడుస్తోందంటూ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: హరి
స్థలం: Hyderabad
రాష్ట్రంలో ప్రజాస్వామ్య సూత్రాలను కాలరాస్తూ స్టేట్ ఆర్గనైజ్డ్ టెర్రరిజం నడుస్తోందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఎన్నికల నామినేషన్ల సమయంలో అధికార పార్టీ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ భయాందోళన వాతావరణం సృష్టించిందని ఆయన ఆరోపించారు. పోలీసుల ఏకపక్ష వ్యవహార శైలి వల్ల సామాన్య ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం సడలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.