భారత్ లో కొత్త వేరియంట్ తో వన్‌ప్లస్ 13ఎస్ విడుదల

రిపోర్టర్: మహేష్ స్థలం: భారతదేశం

భారత మార్కెట్లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తన వన్‌ప్లస్ 13ఎస్ ఫోన్ కొత్తగా 16జీబీ ర్యామ్ మరియు 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ను విడుదల చేసింది. దీని ధరను రూ. 68,999గా నిర్ణయించగా, ప్రముఖ బ్యాంకుల క్రెడిట్ కార్డుల ద్వారా రూ. 2,000 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, 5,850ఎంఏహెచ్ బ్యాటరీ, అమోలెడ్ డిస్‌ప్లేతో కూడిన ఈ ఫోన్ అమెజాన్ మరియు వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.