కొమరాడ కేజీబీవీ ప్రిన్సిపల్ అపస్మారక స్థితి: హెల్త్ కౌన్సెలర్పై కేటీఎఫ్ ఫైర్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: పార్వతీపురం

కొమరాడ కేజీబీవీ ప్రిన్సిపల్ అరుణ బ్రెయిన్ స్ట్రోక్కు గురికావడానికి హెల్త్ కౌన్సెలర్ వేధింపులే కారణమని కేజీబీవీ ప్రిన్సిపల్స్, టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు కె.విజయగౌరి విమర్శించారు. ప్రిన్సిపల్ విధుల్లో కౌన్సెలర్ తలదూర్చడం వల్లే ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని డీఈవో బ్రహ్మాజీరావుకు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. బాలికల పాఠశాలలో పురుష కౌన్సెలర్ను నియమించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.