ముఖ స్కాన్‌తోనే అరవై రకాల వైద్య పరీక్షలు!
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: గుంటూరు
సూది గుచ్చకుండా, రక్తం తీయకుండా కేవలం ముఖాన్ని స్కాన్ చేసి 60 సెకన్లలోనే 60 రకాల వైద్య పరీక్షల నివేదికలను అందించే అత్యాధునిక ఏఐ సాంకేతికతను మంగళగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏపీలోనే తొలిసారిగా ప్రవేశపెడుతున్నారు. మంత్రి లోకేశ్ సహకారంతో ఏర్పాటైన ఈ ఏఐ వెల్‌నెస్ క్లినిక్ ట్రయల్‌రన్ బుధవారం ప్రారంభం కానుంది. రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు ఇది దోహదపడుతుంది.