గుర్ల మండలం వద్ద ఘోర ప్రమాదం: ఆటోను ఢీకొన్న బైక్
రిపోర్టర్: సునీల్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా గుర్ల మండలం గుజ్జంగివలస వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోను ద్విచక్రవాహనం వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు స్పష్టం చేశారు.