గాంధీనగర్‌లో మహిళా పోలీసు కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి
రిపోర్టర్: రమేష్
స్థలం: గుజరాత్
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 28 ఏళ్ల మహిళా పోలీసు కానిస్టేబుల్ జాన్వీ దభి తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతురాలి గది నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మరణానికి రెండు రోజుల ముందు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.