మైపాడు బీచ్‌లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమం
రిపోర్టర్: రాజేష్
స్థలం: నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని మైపాడు బీచ్‌లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కనకరాజు ఆధ్వర్యంలో శనివారం తీర ప్రాంత పరిశుభ్రతా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ అవశ్యకతను నొక్కిచెబుతూ బీచ్‌లోని వ్యర్థాలను తొలగించి శుభ్రం చేశారు.