ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల చట్టం గడువు సెప్టెంబర్ 15కి పొడిగింపు.

రిపోర్టర్: సతీష్ స్థలం: మహారాష్ట్ర

మహారాష్ట్రలో ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల నియంత్రణ చట్టం ముసాయిదాపై సలహాలు, అభ్యంతరాల స్వీకరణ గడువును ప్రభుత్వం సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. విపరీతంగా వస్తున్న స్పందన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 11 వేలకు పైగా అభ్యంతరాలు అందాయి. పారదర్శకత, నాణ్యత కోసమే ఈ కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నారు.