పవన్ కళ్యాణ్ గొప్పదనాన్ని గుర్తు చేసుకున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

ది ప్యారడైజ్ ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గొప్పదనాన్ని గుర్తు చేసుకున్నారు. వకీల్ సాబ్ సినిమా సమయంలో తనకు రావాల్సిన ఐదు కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకోకుండా పవన్ సహకరించారని ఆయన తెలిపారు. అలాగే ఈ చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి తక్కువ ధరకే వైజాగ్ రైట్స్ ఇచ్చారని కొనియాడారు. నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమా నైజాంలో యాభై కోట్ల షేర్ సాధిస్తుందని దిల్ రాజు ధీమా వ్యక్తం చేశారు.