మంచిర్యాల వైద్య ఆరోగ్యశాఖలో ఘనంగా సర్దార్ పటేల్ జయంతి వేడుకలు

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని శనివారం మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జాతీయ ఐక్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది జాతీయ ఐక్యత మరియు దేశ సమగ్రత కోసం ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.