మహిళల ఆర్థిక స్వావలంబన: కోళ్ల పెంపకంతో మారిన గిరిజన మహిళ జీవితం

రిపోర్టర్: వెంకట్ స్థలం: Gumla

జార్ఖండ్ రాష్ట్రంలోని గుమ్లా జిల్లా బోరాంగ్ గ్రామానికి చెందిన గిరిజన మహిళ పూల్ కుమారి కోళ్ల పెంపకంతో అద్భుతమైన విజయం సాధించారని ఐసీఏఆర్ అధికారులు తెలిపారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న ఆమె, కేవలం నూరు కోడిపిల్లలతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించి ఇవాళ ఏటా రెండు లక్షలకు పైగా నికర ఆదాయం ఆర్జిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విజయంతో స్థానికంగా ఉన్న మరో ముప్పై మంది మహిళలకు ఆమె ఆదర్శంగా నిలిచి ఉపాధి పొందేలా చేయూతనందిస్తున్నారని వెల్లడించారు.