నిరుపేదల సీజేఎఫ్ఎస్ భూములను కబ్జా చేస్తున్న బడాబాబులు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: చిల్లకూరు

చిల్లకూరు మండలంలో నిరుపేదలకు కేటాయించిన సీజేఎఫ్ఎస్ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని స్థానికులు తెలిపారు. అయిదు దశాబ్దాల క్రితం ప్రభుత్వం పంపిణీ చేసిన ఈ భూములను ఆర్థిక ఇబ్బందులతో సాగు చేయలేక నిరుపేదలు బీడుగా వదిలేశారు. పేదల అవసరాలను ఆసరాగా చేసుకున్న బడాబాబులు వారితో ఒప్పందాలు కుదుర్చుకుని విక్రయాలకు తెరలేపారు. అధికారులు మొక్కుబడిగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై తహసీల్దార్ గోపీనాథ్రెడ్డి స్పందిస్తూ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.