వెస్టిండిస్ మహిళల టెస్టు మ్యాచ్కు ఆర్థిక సాయం అందించేందుకు ఈసీబీ సిద్దం
రిపోర్టర్: కిరణ్
స్థలం: London
వెస్టిండిస్ పర్యటనలో ఇంగ్లండ్ మహిళల జట్టు ఆడే టెస్టు మ్యాచ్కు అవసరమైతే ఆర్థిక సాయం అందిస్తామని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు చైర్మన్ రిచర్డ్ థాంప్సన్ వెల్లడించారు. కరేబియన్ బోర్డు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ మ్యాచ్ రద్దు కాకుండా చూసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 2027 యాషెస్ సిరీస్కు సన్నాహకంగా ఈ రెడ్-బాల్ మ్యాచ్ తమకు ఎంతో కీలకమని ఆయన స్పష్టం చేశారు.