మతసామరస్య వేదికగా వినాయక చవితి వేడుకలకు పోలీసుల మార్గదర్శకాలు

రిపోర్టర్: RAVI BABU స్థలం: వెదురుకుప్పం

తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు రానున్న వినాయక చవితి వేడుకలను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసు అధికారులు ముందస్తు భద్రతా చర్యలు ముమ్మరం చేశారు. సమస్యాత్మక గ్రామాల్లో స్థానిక పెద్దలు, ఉత్సవ నిర్వాహకులతో ప్రత్యేక కౌన్సెలింగ్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వేడుకల్లో డీజేలకు ఎలాంటి అనుమతి లేదని, నిర్ణీత శబ్ద పరిమితులు పాటిస్తూ మత సామరస్యాన్ని కాపాడాలని స్పష్టం చేశారు. విగ్రహాల ప్రతిష్ఠాపన, నిమజ్జన ఊరేగింపుల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, ప్రజలంతా భద్రతకు సహకరించాలని జిల్లా పోలీస్ యంత్రాంగం పిలుపునిచ్చింది.