పోలాండ్ లో కాల్పుల కలకలం: ఐదుగురు మృతి, డజనుకు పైగా క్షతగాత్రులు
రిపోర్టర్: విజయ్
స్థలం: Krakow
పోలాండ్ దేశంలోని క్రాకో నగరం ప్రధాన మార్కెట్ చతురస్రంలో జరిగిన ఘోర కాల్పుల ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని, పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని పోలీసు అధికారులు శనివారం తెలిపారు. ఈ దుర్ఘటనపై ప్రధాని డోనాల్డ్ టస్క స్పందిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ఘటనకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని ఎక్స్ వేదికగా వెల్లడించారు. నిందితుడిని పోలీసులు కాల్చి హస్పిటల్ కు తరలించారని అత్యవసర బృందాలు వెల్లడించాయి.