నెల్లూరులో యువకుడు దారుణ హత్య, కత్తిపోట్లతో కలకలం

రిపోర్టర్: రాము స్థలం: నెల్లూరు

నెల్లూరు రూరల్ మండలం అశోక్ నగర్ లండన్ లేఔట్‌లో చందు (20) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. చెన్నైలో ఉద్యోగం చేసే అతను ఇటీవల నెల్లూరుకు వచ్చాడు. శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి మద్యం సేవించిన అనంతరం, శనివారం ఉదయం కత్తిపోట్లతో శవంగా కనిపించాడు. వాకింగ్‌కి వచ్చిన స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.