బంగ్లాదేశ్ చొరబాటుదారులపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్ర ఆందోళన

రిపోర్టర్: సతీష్ స్థలం: రంగారెడ్డి

గత ఐదు దశాబ్దాలలో సుమారు రెండు నుండి ఆరు కోట్ల మంది బంగ్లాదేశీయులు దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని చేవెళ్ల లోకసభ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. లోపభూయిష్టమైన సరిహద్దుల కారణంగానే ఈ అక్రమ చొరబాట్లు నిరంతరం కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వారిలో చాలామందికి ఆధార్ కార్డులు కూడా లభించాయని, జనాభా పెరుగుదల కారణంగా ముప్పు మరింత పెరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. రోహింగ్యా అంశం ఇందుకు పూర్తిగా భిన్నమైన వేరే సమస్యని ఆయన వెల్లడించారు.