రాజ్యసభ ఉపఎన్నిక: మధ్యప్రదేశ్ బీజేపీ అభ్యర్థిగా హర్దీప్ సింగ్ పురి నామినేషన్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: భోపాల్

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి శనివారం తన నామినేషన్ దాఖలు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. భోపాల్లోని రాష్ట్ర అసెంబ్లీ భవనానికి ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ ఖండేల్వాల్తో కలిసి చేరుకున్న ఆయన ఎన్నికల అధికారులకు పత్రాలు అందజేశారు. హర్దీప్ సింగ్ పురి నామినేషన్ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడంతో రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.