టెలివిజన్ మాధ్యమంపై రోహిత్ రాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు: నా ఉద్దేశం అది కాదంటూ వివరణ
రిపోర్టర్: గోపి
స్థలం: ముంబై
భారతీయ టెలివిజన్ మాధ్యమంపై తాను చేసిన డస్ట్ బిన్ మీడియం వ్యాఖ్యలు వ్యక్తిగత విమర్శలు కావని నటుడు రోహిత్ రాయ్ స్పష్టం చేశారు. కేవలం నాణ్యతా ప్రమాణాలపైనే తాను ఆందోళన వ్యక్తం చేసినట్లు ఏఎన్ఐ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. పూర్తి ఇంటర్వ్యూ చూడకుండానే కొందరు యువ నటులు తనపై సోషల్ మీడియాలో వ్యక్తిగత దాడికి దిగడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రేక్షకులు చూస్తారనే ఉద్దేశంతో నాణ్యత లేని కంటెంట్ ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు.