ముంబై అధికారులకు భారీ షాక్: నవంబర్ జీతాలు నిలిపివేసిన సుప్రీంకోర్టు

రిపోర్టర్: సునీల్ స్థలం: Mumbai

ముంబైలోని బోరివలిలో బెస్ట్ బస్ స్టేషన్ కోసం కేటాయించిన భూమిలో అక్రమ కబ్జాలను తొలగించడంలో విఫలమైన బీఎంసీ కమిషనర్ అశ్విని భిడేతో పాటు ఇతర అధికారుల నవంబర్ నెల జీతాలను సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు త్రిసభ్య ధర్మాసనం అధికారులపై ధిక్కరణ చర్యలు ప్రారంభించి షోకాజ్ నోటీసులు జారీ చేసిందని, అదనపు గడువు కోరిన అభ్యర్థనను తోసిపుచ్చి ఐదు లక్షల జరిమానా విధించిందని ప్రధానన్యాయమూర్తి సూర్యకాంత్ స్పష్టం చేశారు.