రణ్వీర్ షోరిపై దాడి చేసినట్లు రాహుల్ భట్ వెల్లడి
రిపోర్టర్: కిరణ్
స్థలం: Mumbai
పూజా భట్ తో గొడవ కారణంగానే తాను నటుడు రణ్వీర్ షోరిపై దాడి చేయాల్సి వచ్చిందని రాహుల్ భట్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. రణ్వీర్ కారు అద్దాలు పగడగొట్టి, అతడి పక్కటెముక విరగ్గొట్టినట్లు ఆయన అంగీకరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పేనని, అయితే ఈ వివాదం ముగిసేలా రణ్వీర్ వ్యవహరించిన తీరు తనకెంతో గౌరవం కలిగించిందని రాహుల్ భట్ పేర్కొన్నారు. ఇరు కుటుంబాల మధ్య దశాబ్దాల క్రితం జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.