నెటన్యాహు పర్యటన వేళ తీవ్ర నిరసనలకు జోహ్రాన్ మామ్దానీ మద్దతు
రిపోర్టర్: శివ
స్థలం: World
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెటన్యాహు న్యూయార్క్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జోహ్రాన్ మామ్దానీ తీవ్ర వివాదానికి తెరలేపారు. ఆయన పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉందని మామ్దానీ స్పష్టం చేశారు. గతంలో నెటన్యాహును 'యుద్ధ నేరస్తుడిగా' అభివర్ణించిన ఆయన, ఇప్పుడు కూడా తన వైఖరిని సమర్థించుకుంటూ ఆందోళనకారులకు అండగా నిలిచారు.