జగిత్యాల బాలుడి వ్యవహారం: త్వరగా తల్లితండ్రులకు అప్పగించాలంటూ మంత్రి సీతక్క ఆదేశం

రిపోర్టర్: శివ స్థలం: Jagtial

జగిత్యాల జిల్లాలో శిశు సంక్షేమ కేంద్రంలో ఉన్న బాలుడి ఉదంతంపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై మంత్రి సీతక్క పీఆర్వో స్పందించారు. వీలైనంత త్వరగా ఆ బాలుడిని తల్లితండ్రులకు అప్పగించాలని మంత్రి సీతక్క ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు అధికారులు బాబును త్వరలోనే అప్పగించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రజావాణిలో కలెక్టర్ దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలు వైరల్ కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.