పరిశ్రమల వ్యర్థ జలాల కలకలం: కాలువల్లోకి మురుగు నీరు విడుదల
రిపోర్టర్: వెంకట్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక వ్యర్థ జలాల శుద్ధిలో నిర్లక్ష్యం ప్రజారోగ్యానికి పెను ముప్పుగా మారుతోందని కాలుష్య నియంత్రణ మండలి అధికారి అశోక్‌కుమార్ తెలిపారు. మెగా, భారీ పరిశ్రమలు, రైస్‌మిల్లుల నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘించి వ్యర్థాలను కాలువలు, పెన్నానదిలోకి వదులుతున్నారని ఆయన పేర్కొన్నారు. గ్రీన్‌బెల్టు ఏర్పాటు చేయకపోవడం, ఎస్టీపీలను వినియోగించకపోవడంపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కాలుష్య సమస్య కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.