పాత గెలాక్సీ ఫోన్లకు వన్ యూఐ నైన్ అప్‌డేట్ ప్రకటన

రిపోర్టర్: హరి స్థలం: తెలంగాణ

ప్రముఖ టెక్ దిగ్గజం శామ్‌సంగ్ తన పాత గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు మరియు ఫోల్డబుల్ డివైజెస్‌కు వన్ యూఐ నైన్ అప్‌డేట్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. థాయ్‌లాండ్‌లో గెలాక్సీ ఎస్25 సిరీస్, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7, జెడ్ ఫ్లిప్ 7 ఫోన్లకు సెప్టెంబర్ 28 నుంచి ఈ అప్‌డేట్ రానుండగా, గెలాక్సీ ఎస్23 ఎఫ్‌ఈకి అక్టోబర్‌లో అందనుంది. ఇందులో కొత్త గెలాక్సీ ఏఐ టూల్స్, మెరుగైన భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.