జీరంఘాటి కేసులో పది మంది ఆదివాసీల మరణశిక్ష రద్దు చేయాలని డిమాండ్
రిపోర్టర్: గోపి
స్థలం: ఛత్తీస్‌గఢ్
ఛత్తీస్గఢ్లోని జీరంఘాటి కేసులో పది మంది ఆదివాసీలకు ఎన్ఐఏ కోర్టు విధించిన మరణశిక్షను వెంటనే రద్దు చేయాలని మాజీ మావోయిస్టు అగ్రనేతలు డిమాండ్ చేశారు. దేవ్ జీ, బండి ప్రకాశ్ తదితర మాజీ నేతలు తాజాగా పత్రికా ప్రకటన విడుదల చేశారు. గతాన్ని తవ్వి తీస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడకుండా, శాంతిని కొనసాగించాలని వారు కోరారు. ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా పీడిత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, రాజకీయ ప్రక్రియ ద్వారా సమస్యను పరిష్కరించాలని వారు స్పష్టం చేశారు.