'ఆర్థిక లావాదేవీలతో సంబంధం లేదు': పోలీసు విచారణకు హాజరైన యూట్యూబర్ నందన

రిపోర్టర్: గోపి స్థలం: ఎన్టీఆర్ జిల్లా

విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ రామ నందన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో పోలీసుల విచారణకు ఒకరోజు ముందే హాజరయ్యారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన విచారణలో ఆమెను పోలీసులు ఇరవై ప్రశ్నలు అడగగా, కన్సల్టెన్సీ వ్యాపారంతో తనకి ఎలాంటి సంబంధం లేదని, తన భర్తే అన్ని లావాదేవీలు చూసుకునేవారని నందన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తనపై ఉన్న లుక్ అవుట్ నోటీసులను రద్దు చేయాలని ఆమె పోలీసులను కోరినట్లు సమాచారం.