పుట్టినరోజు నాడే సాఫ్ట్వేర్ ఉద్యోగికి షాకిచ్చిన కంపెనీ ఉద్వాసన
రిపోర్టర్: వెంకట్
స్థలం: Mumbai
ముంబై నగరానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ నిపుణుడికి కంపెనీ యాజమాన్యం పుట్టినరోజు నాడే ఊహించని షాక్ ఇచ్చింది. కీలక ప్రాజెక్టులలో క్రియాశీలకంగా పనిచేస్తున్నప్పటికీ, భారత్ టెక్ బృందంపై ఆధారపడటాన్ని తగ్గించే క్రమంలో ఎనిమిది మందిని తొలగిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని బాధిత టెకీ రెడ్ది వేదికగా పంచుకున్నారు. ప్రధాన ప్రాజెక్టుల బాధ్యతలు నిర్వర్తిస్తున్న తరుణంలో తొలగింపునకు గురవడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉద్యోగార్థం ఇంటర్వ్యూలకు సన్నద్ధమవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.