జగన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ మంత్రి కొల్లు రవీంద్ర
రిపోర్టర్: శివ
స్థలం: అమరావతి
వాస్తవాలను పక్కదారి పట్టించి రాజకీయ లబ్ధి పొందడమే వైఎస్ జగన్మోహన్రెడ్డి నీతని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. జగన్పై ఉన్న ఆర్థిక నేరాల కేసుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపుపై విచారణ వేగవంతం చేయాలని, తప్పు చేసినవారు చట్టం నుంచి తప్పించుకోలేరని ఆయన స్పష్టం చేశారు.