దిల్జిత్ దోసాంజ్ కచేరీ: ప్రయాణికుల కోసం ప్రత్యేక మెట్రో సేవలు పొడిగింపు

రిపోర్టర్: సతీష్ స్థలం: New Delhi

పంజాబీ గాయకుడు దిల్జిత్ దోసాంజ్ సంగీత కచేరీకి హాజరయ్యే అభిమానుల సౌకర్యార్థం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శుక్రవారం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమం కోసం ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మినహా అన్ని లైన్లలో మెట్రో వేళలను పొడిగించినట్లు అధికారులు తెలిపారు. సుమారు డెబ్బై వేల మంది అభిమానులు వస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలో అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.