రైతుల సమస్యలపై పోరాటమే లక్ష్యమన్న బిజెపి కిసాన్ మోర్చా నూతన అధ్యక్షుడు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: హాజీపూర్

బిజెపి కిసాన్ మోర్చా హాజీపూర్ మండల అధ్యక్షులుగా స్వామి రెడ్డి నియమితులయ్యారు. ఆయనకు బిజెపి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ మరియు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గోపతి రాజయ్య నియామక పత్రాన్ని అందజేశారు. నూతన అధ్యక్షులు స్వామి రెడ్డి మాట్లాడుతూ హాజీపూర్ మండలంలోని అన్ని గ్రామాలలో రైతుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తన నియామకంపై స్వామి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.