సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఉన్నతాధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశాలు సజావుగా సాగేలా భద్రత, వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని, సభ్యులకు సమాచారం ముందస్తుగా అందించాలని అధికారులను స్పీకర్ ఆదేశించారు. సభలో ప్రశాంత వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.