వైద్యం వికటించి వ్యక్తి మృతి, పూడ్చిన మృతదేహం వెలికితీత
రిపోర్టర్: భాస్కర్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలంలో ఆర్ఎంపీ వైద్యుడి చికిత్స వికటించి వ్యక్తి మృతి చెందిన ఘటనలో వివాదం తలెత్తింది. వెంకన్నపాలెంకు చెందిన పాముల సురేంద్ర గ్యాస్ట్రబుల్ సమస్యతో ఆర్ఎంపీని ఆశ్రయించి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి వైద్యుల చేత పోస్టుమార్టం నిర్వహించారు.