విజయవాడలో విదేశీయుల వసతిపై పోలీసుల కఠిన నిబంధనలు జారీ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: విజయవాడ
విదేశీయులకు ఆశ్రయం కల్పించే హోటళ్లు, విద్యాసంస్థలు తప్పనిసరిగా వారి వివరాలను ఇరవై నాలుగు గంటల్లో వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని విజయవాడ పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే యాజమాన్యాలపై జరిమానాతో పాటు ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఓసీఐ కార్డుదారులు ఎన్నికల్లో పోటీ చేయడానికి లేదా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలులేదని సీపీ తెలిపారు.