ముంచంగిపుట్టులో ప్రజలకు భద్రతపై పోలీస్ శాఖ అవగాహన

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: అల్లూరి సీతారామరాజు

అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగారుమెట్ట శాండీ వద్ద ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమంలో భాగంగా మహిళలు, పిల్లల భద్రత, రోడ్డు భద్రత మరియు మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు Alluri Police వెల్లడించారు. ప్రయాణంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించి సురక్షిత ప్రయాణంతో సంతోషకర జీవితాన్ని గడపాలని ఈ సందర్భంగా పోలీసులు పిలుపునిచ్చారు.