రైలు ఢీకొని మూడొందల గొర్రెలు మృతి చెందిన ఘటన
రిపోర్టర్: మహేష్
స్థలం: యాదాద్రి భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఘట్కేసర్ రైల్వేస్టేషన్ల మధ్య ఘోర ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు దాటుతున్న సమయంలో రైలు ఢీకొని సుమారు మూడు వందల గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయని పోలీసులు తెలిపారు. అలీనగర్‌కు చెందిన గొర్రెల కాపరి కిష్టయ్యకు దాదాపు ఇరవై లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని పరామర్శించారని, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారని వెల్లడించారు.