ప్రకాశం జిల్లా నల్లమల అడవుల్లో పెద్దపులి కలకలం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: ప్రకాశం జిల్లా
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పెద్దబొమ్మలాపురం సమీపంలోని నల్లమల అటవీ సరిహద్దుల్లో పెద్దపులి సంచారం కలకలం రేపింది. పశువుల మందపై దాడి చేసి చంపిన పులి, మాంసాన్ని ఆరగిస్తున్న దృశ్యాలు అటవీశాఖ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. దీంతో పరిసర గ్రామాల ప్రజలు, పశువుల కాపరులు తీవ్ర భయాందోళనలకు గురవుతుండగా, అటవీ అధికారులు అప్రమత్తమై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు.