రంగారెడ్డి జిల్లాలో ప్రముఖ రియల్టర్ రాంరెడ్డి ఆత్మహత్య
రిపోర్టర్: సునీల్
స్థలం: రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరులోని ఫాంహౌస్‌లో ప్రముఖ రియల్టర్, హ్యోమ్ ల్యాండ్ అధినేత రాంరెడ్డి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పటాన్‌చెరులో 280 ఎకరాల్లో ఆయన నూతన వెంచర్ ఏర్పాటు చేస్తున్నారు. రాజకీయ నాయకుల తీవ్ర ఒత్తిడి కారణంగానే ఆయన ఈ బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.