జనసేన పార్టీకి ఐదు మేయర్ స్థానాలు కేటాయించినట్లు గ్రేట్ ఆంధ్ర వెల్లడి
రిపోర్టర్: శివ
స్థలం: Andhra Pradesh
గ్రేట్ ఆంధ్ర న్యూస్ వెల్లడించిన సమాచారం ప్రకారం రాష్ట్రంలోని ఐదు మేయర్ స్థానాలు జనసేన పార్టీకి కేటాయించినట్లు తెలుస్తోంది. కాకినాడ, మచిలీపట్నం, విజయవాడ, ఒంగోలు మరియు తిరుపతి కార్పొరేషన్ల మేయర్ పదవులు జనసేన పార్టీకి దక్కనున్నట్లు ఆ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ పరిణామంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుండగా, దీనిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.