మంథనిలో గణపతి హోమంలో పాల్గొన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
రిపోర్టర్: రాజేష్
స్థలం: మంథని
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని రావుల చెరువుకట్టపై ఉన్న హనుమాన్ ఆలయంలో ఏర్పాటు చేసిన గణనాథుని వద్ద నిర్వహించిన గణపతి హోమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఘనంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విగ్నేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతోందని, సింగరేణి ప్రాంతాల్లోని పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.