బెంగళూరు ఆసుపత్రిలో అమెరికా యువతికి నేత్ర శస్త్రచికిత్స: అద్భుత విజయం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: బెంగళూరు
బెంగళూరులోని డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రిలో అమెరికన్ పర్యాకురాలు స్టోన్ఫిష్ కంటి శస్త్రచికిత్స చేయించుకుని అద్భుత దృష్టిని పొందారని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తన స్నేహితురాలి కోసం ఆసుపత్రికి వెళ్లిన ఆమె, ఉచిత పరీక్షల తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నారు. అమెరికా ఆరోగ్య వ్యవస్థతో పోలిస్తే భారతదేశంలో వైద్య సేవలు ఎంతో సులభంగా, చౌకగా అందుబాటులో ఉన్నాయని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు.