'2800 శాతం లాభం అీయం': మహారాష్ట్ర ఎఫ్డీఏ కమిషనర్ తుకారాం ముండే ఫైర్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: మహారాష్ట్ర
మహారాష్ట్రలో వైద్య పరికరాల ధరలపై నిర్వహించిన సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. తయారీదారులు ఆసుపత్రులకు అమ్మే ధరకు, రిటైల్ మార్కెట్లోని గరిష్ట చిల్లర ధర (MRP)కు మధ్య ఏకంగా 2800 శాతం వరకు లాభం ఉంటోందని మహారాష్ట్ర ఎఫ్డీఏ కమిషనర్ తుకారాం ముండే వెల్లడించారు. రూ. 11 ఉండే ఐవీ సెట్లను రూ. 325కు అమ్ముతున్నారని, ఈ భారీ ధరల వ్యత్యాసంపై జోక్యం చేసుకోవాలని నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీకి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.