కడియం శ్రీహరిపై అనర్హత వేటు టెన్షన్
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటంతో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలో టెన్షన్ మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఆయనపై పార్టీ ఫిరాయింపుల కింద హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కుమార్తె కడియం కావ్య నామినేషన్‌పై సంతకం చేయడం, కాంగ్రెస్ కండువాతో ప్రచారంలో పాల్గొనడంతో ఆయనపై వేటు పడే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.