పెద్దపుట్టు కుజబంగి గ్రామాల్లో రీ సర్వే భూపట్టాల పంపిణీ కార్యక్రమం

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: ముంచంగిపుట్టు

అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం బంగారుమెట్ట పంచాయతీ పరిధిలోని పెద్దపుట్టు మరియు కుజబంగి గ్రామాల్లో రీ సర్వే ద్వారా అర్హులైన లబ్ధిదారులకు భూపట్టాలు పంపిణీ చేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని నిరుపేద రైతులకు నూతన భూమి పట్టాలను అందజేశారు. ఈ పంపిణీతో భూ వివాదాలు తొలగిపోతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.