ఫామ్ కోల్పోవడానికి సుదీర్ఘ విరామమే కారణం: మహమ్మద్ సిరాజ్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: చెన్నై
భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ తన పేలవ ప్రదర్శనపై స్పందించారు. సుదీర్ఘమైన రెండు నెలల విరామం కారణంగానే తాను లయ కోల్పోయానని, రన్-అప్‌లో ఇబ్బంది పడ్డానని వెల్లడించారు. శ్రీలంక సిరీస్ అలాగే దులీప్ ట్రోఫీలో రిథమ్ అందుకోవడానికి కష్టపడ్డానని, అయితే త్వరలోనే తన పూర్తి స్థాయి ఫామ్‌ను తిరిగి సాధిస్తానని సిరాజ్ ధీమా వ్యక్తం చేశారు.