రాజాపేట మండలంలో ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని ఎన్కే ఫంక్షన్ హాల్లో ఎంఈఓ మనోజ్ కుమార్ అధ్యక్షతన 2026 సంవత్సరానికి ఎంపికైన 18 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, మాజీ ఎంఈఓ చందా రమేష్ తదితరులు పాల్గొని ఉపాధ్యాయులను శాలువాలు, ప్రశంసా పత్రాలతో సత్కరించి అభినందించారు.