స్వార్థ రాజకీయాల కోసం సొంత మనుషులను ముంచుతారంటూ కేటీఆర్పై కల్వకుంట్ల కవిత ధ్వజం

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

స్వార్థ రాజకీయాల కోసం తనను నమ్ముకున్న వారిని, సహాయం చేసిన వారిని కూడా కేటీఆర్ నట్టేట ముంచుతారని తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, ఉద్యమ కాలంలో ఆదుకున్న ప్రతిమా శ్రీనివాసరావుపై లేఖ రాయడం కేటీఆర్ నైజానికి నిదర్శనమని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం సొంత బంధువులను కూడా ఆయన మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.