సౌదీపై దాడి చేస్తే పాకిస్థాన్ ఊరుకోదు: ఖవాజా ఆసిఫ్ హెచ్చరిక
రిపోర్టర్: రాజేష్
స్థలం: World
యెమెన్ ఘర్షణలు సౌదీ అరేబియా భూభాగంలోకి విస్తరిస్తే పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీల మధ్య కుదిరిన నూతన రక్షణ ఒప్పందం అమల్లోకి వస్తుందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరించారు. ముమ్మాటికీ ఇది ఉమ్మడి రక్షణ ఒప్పందమని, సభ్య దేశాలపై దాడి జరిగితే ముందూడడుగు వేస్తామని స్పష్టం చేశారు. సౌదీపై హూతీల క్షిపణి దాడుల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.